జాలాది
జనకవి,మహాకవి,జానపద గేయ శిరోమణి....
Tuesday, 1 November 2011
ARTICLE ON JALADI bY JALADI SUDHEER FROM SAKSHI FUNDAY 30th Octo 2011
Monday, 31 October 2011
janam mechhina jaalaadi ( జనం మెచ్చిన జాలాది ) article on jaladi
Monday, 17 October 2011
Sunday, 16 October 2011
ఆత్రేయ సాహితీ స్రవంతి - జాలాది
జనకవి జాలాది ఈరోజు కన్నుమూశారు అనే వార్త మనసు కలిచివేసింది." ఆత్రేయ సాహితీ స్రవంతి" తరపున ఆత్రేయ 85 వ జయంతిని పురస్కరించుకొని 7 మే 2006 న అనకాపల్లికి వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సన్మానించి "జానపద గేయ శిరోమణి" అనే బిరుదునుకూడా ప్రదానం చెయ్యడమైనది. తెలుగు సినీ సాహిత్యంలో వారి పాటలు మరువరానివి. తెలుగు సినీ గీతాలు ఆధునికతను సంతరించుకొని కొత్త పోకడలు పోతున్న దశలో ధైర్యంగా వారు రచించే సినీగీతాలలో జనపదాలను జోడించి జానపద శైలితో కూడిన పాటలను ప్రజలకు అందించి మన్ననలు పొందారు. వ్యక్తిగతంగా నాతరపున,"ఆత్రేయ సాహితీ స్రవంతి" తరపున జాగాదిగారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తూ వారికి ఘననివాళి అర్పిస్తున్నాను.
ఆత్రేయ సాహిత్యాంశాలను మరియు తన సినీ జీవిత విశేషాలను ముచ్చటిస్తున్నశ్రీ జాలాది
ఆత్రేయ సాహిత్యాంశాలను మరియు తన సినీ జీవిత విశేషాలను ముచ్చటిస్తున్నశ్రీ జాలాది . వేదికపై ఆత్రేయ సాహితీ స్రవంతి ఉపాధ్యక్షులు శ్రీ భమిడిపాటి ప్రసాద రావు
డా.తలతోటి పృథ్వీ రాజ్ రూపొందించిన "ఆత్రేయ ఆణిముత్యాలు" ఆడియో సి.డీ.ని శ్రీ జాలాది గారికి కానుకగా అందిస్తున్న సాహిత్యాభిమాని,ఇండియన్ హైకూ క్లబ్ పోషకులు డా.కె.విష్ణుమూర్తి.
ఆత్రేయ సాహితీ స్రవంతి ఉపాధ్యక్షులు శ్రీ భమిడిపాటి ప్రసాద రావు గారికి జ్ఞాపికని అందిస్తున్న శ్రీ జాలాది.
(ఎడమనుండి కుడికి):ఆత్రేయ సాహితీ స్రవంతి అధ్యక్షులు - వ్యవస్థాపకులు డా.తలతోటి పృథ్విరాజ్ , ఉపాధ్యక్షులు శ్రీ భమిడిపాటి ప్రసాద రావు, ఇండియన్ హైకూ క్లబ్ ప్రధాన కార్యదర్శి గట్టి గ్రహ్మాజీ, గౌరవ అధ్యక్షులు జి.రంగబాబు గార్లు జాలాది గారిని పూలకిరీతంతో...శాలువాతో...జ్ఞాపికతో..."జానపద గేయ శిరోమణి." బిరుదుతో సన్మానిస్తున్న దృశ్యం.
ఆత్రేయ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన జాలాది గారు.
Subscribe to:
Posts (Atom)