Welcome to my blog
go to my homepage
Go to homepage
" జీవితం గాయం చేసినప్పుడు, గేయం ఇచ్చే ఓదార్పు ఎలాంటిదో తెలియాలంటే జాలాది రచన వినాలి. ఆగని పరుగుపందెంలో అలసిపోతున్నప్పుడు ఆ బడలిక తీరాలంటే, జాలాది గీతాన్ని గానం చేయాలి. జీవితమనే సాగరయానంలో దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్నప్పుడు జీవన తత్వాన్ని చుక్కానిగా అందించే మాట - జాలాది పాట " ~ జయ         ""జాలాది పండితకుటుంబంనుంచి వచ్చిన వ్యక్తి కాదు.సహజ కవి. సమాజంపట్ల బాధ్యత కలిగిన కవి. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలిచి వాళ్ళ భావాలను తన గొంతులో పలికించారు.ఆయనకు ప్రభుత్వం ఇచ్చే అవార్డ్ లు అక్కర్లేదు. ముప్పై ఏళ్ల తర్వాతకూడా ఆయన రాసిన 'ఏతమేసి తోడినా ...' అనే పాటను గుర్తుంచుకుంటున్నామంటే అంతకంటే వేరే అవార్డ్ ఏముంటుంది? ఆయన జన నిఘంటువులాంటి వ్యక్తి" ~ చిరంజీవి"         "కొన్ని సామాజిక వర్గాలవారికే ఆలవాలమయిన చిత్ర పరిశ్రమలో ఒక మోదుకూరి జాన్సన్, ఒక జాలాది కలంపట్టి అగ్రస్థానంలో నిలవగలగడం , మానవుడు చంద్రమండలం మీద కాలు మోపినదానికంటే పెద్ద విజయం." ~సతీష్ చందర్         "తెలుగు గీతల్లో జాలాది ఆత్మ సజీవంగా ఉంటుంది." ~చిరంజీవి         "జానపద బాణీని సినీ రచనలో ఒరవడిగా దిద్దిన కవి జాలాది" ~గొల్లపూడి మారుతీరావు         " 'చిటికనేళ్ళు కలిస్తే కల్యాణం. బొటన వేళ్ళు కలిస్తే నిర్యాణం' అంటూ రెండే రెండు మాటల్లో జీవితాన్ని ఆవిష్కరించిన కవి జాలాది. ఆయన గీతాలు అనన్య సామాన్యం. శ్రీశ్రీ తర్వాత అంతగా ఆలోచింప జేసిన గీతాలు ఆయనవి" ~చిరంజీవి         "జనంలోనుంచి పుట్టిన కవి. సినిమా పాటకు గౌరవాన్ని, ఉన్నతిని, అత్యున్నత స్థానాన్ని కల్పించిన కవి జాలాది." ~కత్తి పద్మారావు         ""జానపద గీతాలకు ఆది జాలాది అన్నట్లు తెలుగు సినీ జానపద గీతాలకు క్రొత్తందాలను తీసుకొచ్చిన జానపద గేయ శిరోమణి జాలాది." ~ డా.తలతోటి పృథ్వీ రాజ్
♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯ ♪ ♫ ♩ ♬ ♭ ♮ ♯

Sunday, 16 October 2011

ఆత్రేయ సాహితీ స్రవంతి - జాలాది

జనకవి జాలాది ఈరోజు కన్నుమూశారు అనే వార్త మనసు కలిచివేసింది." ఆత్రేయ సాహితీ స్రవంతి" తరపున ఆత్రేయ  85 వ జయంతిని పురస్కరించుకొని 7 మే 2006 న అనకాపల్లికి వారిని ముఖ్య అతిథిగా   ఆహ్వానించి ఘనంగా సన్మానించి "జానపద గేయ శిరోమణి" అనే బిరుదునుకూడా ప్రదానం చెయ్యడమైనది. తెలుగు సినీ సాహిత్యంలో వారి పాటలు మరువరానివి. తెలుగు సినీ గీతాలు ఆధునికతను సంతరించుకొని కొత్త పోకడలు పోతున్న దశలో ధైర్యంగా వారు రచించే సినీగీతాలలో జనపదాలను జోడించి జానపద శైలితో కూడిన పాటలను ప్రజలకు అందించి మన్ననలు  పొందారు.  వ్యక్తిగతంగా నాతరపున,"ఆత్రేయ సాహితీ స్రవంతి" తరపున జాగాదిగారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తూ వారికి ఘననివాళి అర్పిస్తున్నాను.


ఆత్రేయ సాహిత్యాంశాలను మరియు తన సినీ జీవిత విశేషాలను ముచ్చటిస్తున్నశ్రీ జాలాది 
ఆత్రేయ సాహిత్యాంశాలను మరియు తన సినీ జీవిత విశేషాలను ముచ్చటిస్తున్నశ్రీ జాలాది . వేదికపై ఆత్రేయ సాహితీ స్రవంతి ఉపాధ్యక్షులు శ్రీ భమిడిపాటి ప్రసాద రావు 
డా.తలతోటి పృథ్వీ రాజ్ రూపొందించిన "ఆత్రేయ ఆణిముత్యాలు" ఆడియో సి.డీ.ని శ్రీ జాలాది గారికి కానుకగా అందిస్తున్న సాహిత్యాభిమాని,ఇండియన్ హైకూ క్లబ్ పోషకులు డా.కె.విష్ణుమూర్తి. 

ఆత్రేయ సాహితీ స్రవంతి ఉపాధ్యక్షులు శ్రీ భమిడిపాటి ప్రసాద రావు గారికి జ్ఞాపికని అందిస్తున్న శ్రీ జాలాది.

(ఎడమనుండి కుడికి):ఆత్రేయ సాహితీ స్రవంతి అధ్యక్షులు - వ్యవస్థాపకులు డా.తలతోటి పృథ్విరాజ్ , ఉపాధ్యక్షులు శ్రీ భమిడిపాటి ప్రసాద రావు, ఇండియన్ హైకూ క్లబ్ ప్రధాన కార్యదర్శి గట్టి గ్రహ్మాజీ, గౌరవ అధ్యక్షులు జి.రంగబాబు గార్లు  జాలాది గారిని పూలకిరీతంతో...శాలువాతో...జ్ఞాపికతో..."జానపద గేయ శిరోమణి." బిరుదుతో సన్మానిస్తున్న  దృశ్యం. 



ఆత్రేయ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన జాలాది గారు.



No comments:

Post a Comment